ఆర్టీసీకి మరో వెయ్యి ఈవీ బస్సులు వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. సచివాలయంలో విద్యుదుత్పత్తి, పంపిణీలో వ్యయం తగ్గింపుపై అంశాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. ప్రభుత్వ భవనాలపై విస్తృత స్థాయిలో సౌర విద్యుత్ ప్రాజెక్టులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలి. ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలకు మరో ఏడాది ప్రోత్సాహకాలు కొనసాగించాలి. ఆర్టీసీకి త్వరలోనే వెయ్యి ఈవీ బస్సులు వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేయాలి. ఒప్పందాలు చేసుకున్న ప్రాజెక్టులు 60 రోజుల్లో కార్యరూపం దాల్చాలి. విద్యుత్ కొనుగోళ్ల భారం తగ్గించుకునేందుకు ఎంవోయూలు కుదుర్చుకోవాలి. ఇతర రాష్ట్రాలతో పవర్ స్వాపింగ్ ఎంవోయూలు చేసుకోవాలి. ప్రభుత్వ శాఖలతో పాటు ప్రజల్లోనూ విద్యుత్ పొదుపుపై అవగాహన కార్యక్రమాలు


