My Telugu NRI

Mobile Scrollable Menu
- Latest News - National & International

చరిత్ర సృష్టించిన భారత్‌

దేశీయ రక్షణ సాంకేతికతలో భారత్‌ మరో కీలక మైలురాయిని చేరుకుంది. భారతక్ష రక్షణ పరిశోధనా సంస్థ యుద్ధవిమాన పైలట్‌ ఎస్కేప్‌ సిస్టమ్‌కు సంబంధించిన హై-స్పీడ్‌ రాకెట్‌-స్లెడ్‌ టెస్ట్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ విషయాన్ని మంగళవారం రక్షణ మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ పరీక్ష స్వదేశీ యుద్ధవిమాన రక్షణ సాంకేతికతలో ఒక పెద్ద అడుగుగా భావిస్తున్నారు. ఈ టెస్ట్‌ చండీగఢ్‌లోని టెర్మినల్‌ బాలిస్టిక్‌ రీసెర్చ్‌ లాబొరేటరీ లో ఉన్న రైల్‌-ట్రాక్‌ రాకెట్‌ స్లెడ్‌ ఫెసిలిటీలో […]

దేశీయ రక్షణ సాంకేతికతలో భారత్‌ మరో కీలక మైలురాయిని చేరుకుంది. భారతక్ష రక్షణ పరిశోధనా సంస్థ యుద్ధవిమాన పైలట్‌ ఎస్కేప్‌ సిస్టమ్‌కు సంబంధించిన హై-స్పీడ్‌ రాకెట్‌-స్లెడ్‌ టెస్ట్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ విషయాన్ని మంగళవారం రక్షణ మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ పరీక్ష స్వదేశీ యుద్ధవిమాన రక్షణ సాంకేతికతలో ఒక పెద్ద అడుగుగా భావిస్తున్నారు.

ఈ టెస్ట్‌ చండీగఢ్‌లోని టెర్మినల్‌ బాలిస్టిక్‌ రీసెర్చ్‌ లాబొరేటరీ లో ఉన్న రైల్‌-ట్రాక్‌ రాకెట్‌ స్లెడ్‌ ఫెసిలిటీలో గంటకు 800 కిలోమీటర్ల వేగంతో నిర్వహించింది. ఈ విజయంతో పైలట్‌ ఎజెక్షన్‌ సిస్టమ్‌ను పూర్తిగా పరీక్షించగలిగే సామర్థ్యం ఉన్న దేశాల జాబితాలో భారత్‌ కూడా చేరింది. మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం.. డీఆర్డీవో అభివృద్ధి చేసిన ఈ ఎస్కేప్‌ సిస్టమ్‌ను నియంత్రిత వేగంతో పరీక్షించారు. కానోపీ సెవెరెన్స్, ఎజెక్షన్‌ సీక్వెన్స్‌, ఎయిర్‌క్రూ రికవరీ ప్రక్రియ వంటి అన్ని దశలు విజయవంతమయయాయి. ఈ టెస్ట్‌ను ఏరోనాటికల్‌ డెవలప్మెంట్‌ ఏజెన్సీ, హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ సంయుక్తంగా నిర్వహించాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.