ప్రపంచవ్యాప్తంగా స్టార్‌డమ్ సంపాదించిన గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రాకు తెలుగు ప్రేక్షకుల లోను ప్రత్యేక గుర్తింపు ఉంది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు తనదైన ముద్ర వేసుకున్న ఆమె మహేష్ బాబు- ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం వారణాసిలో మందాకిని అనే కీలక పాత్రలో కనిపించనున్నారు. మహేష్ బాబు కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.ఇటీవల ఈ మూవీకి సంబంధించిన ఈవెంట్ భారీ ఎత్తున జరిగింది. దీంతో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఈవెంట్‌లో ప్రియాంక తన లుక్‌తో ఆకట్టుకుంది.
అయితే ఒకవైపు వారణాసి చిత్రం చేస్తున్న ప్రియాంక చోప్రా ఇప్పుడు మరో తెలుగు సినిమాకి సైన్ చేసిందని అంటున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న కల్కి 2 కోసం ఆమెని సంప్రదించగా దానికి ప్రియాంక గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. కల్కి తొలి పార్ట్‌లో నటించిన దీపికా పదుకొణే పలు కారణాల వలన తప్పుకోవడంతో ఆ స్థానంలో ప్రియాంకని తీసుకుంటున్నట్టు టాక్.సీక్వెల్‌లో కమల్ హాసన్ విలన్‌గా కనిపించి తన నటనతో ప్రేక్షకుల మైండ్ బ్లాక్ చేయనున్నాడు. సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మరి ప్రియాంక ఇందులో నటించనుందని వస్తున్న వార్తలలో నిజం ఎంత ఉందనేది తెలియాల్సి ఉంది.


