ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఉక్రెయిన్-రష్యా సంక్షోభంపై ప్రధాని మోదీ స్పందిస్తూ భారత్ తటస్థంగా లేదు అని, తాము శాంతి వైపు ఉన్నామని అన్నారు. ఢిల్లీలో హైదరాబాద్ హౌజ్‌లో పుతిన్‌తో జరిగిన సమావేశం సందర్భంగా ప్రధాని మోదీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చర్చల, దౌత్యం ద్వారా ఉక్రెయిన్ సంక్షోభానికి ఫుల్స్టాప్ పెట్టాలని మోదీ పేర్కొన్నారు. ఆ సంక్షోభానికి శాంతియుత పరిష్కారాన్ని ఆశిస్తున్నామని, దానికే తమ మద్దతు ఉంటుందని ప్రధాని తెలిపారు. అయితే మోదీ వ్యాఖ్యలకు పుతిన్ స్పందించారు. ఉక్రెయిన్‌తో కొనసాగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు శాంతియుత పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామని పుతిన్ తెలిపారు.


