రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ కి మరో షాక్ తగిలింది. యస్ బ్యాంక్‌ను మోసం కేసులో రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్‌కు చెందిన రూ.1,120 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తాజాగా అటాచ్ చేసింది. ఇందులో 18 ఆస్తులు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బ్యాంక్ బ్యాలెన్స్, షేర్‌హోల్డింగ్ వంటివి ఉన్నాయి. రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌కు చెందిన 7 ఆస్తులు, రిలయన్స్ పవర్ లిమిటెడ్‌కు చెందిన రెండు ఆస్తులు, రిలయన్స్ వాల్యూ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన 9 ఆస్తులు ఉన్నాయి. కాగా, మనీలాండరింగ్‌కు సంబంధించి ఇప్పటికే రూ.8,997 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజా చర్యతో వాటి విలువ మొత్తం రూ.10 వేల కోట్లకు పైగానే ఉంది. కాగా, అనిల్ అంబానీకి చెందిన గ్రూప్ కంపెనీలు కోట్ల రూపాయల బ్యాంకు రుణాల మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్నాయి.


