గిరిజనులకు జీవనోపాధి మార్గాలు పెంచాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అధికారులతో సచివాలయంలో టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. గిరిజనులకు జీవనోపాధి మార్గాలపై పకడ్బందీ ప్రణాళికను అమలు చేయాలని మార్గనిర్దేశం చేశారు. గిరిజన ఉత్పత్తుల పెంపు, మార్కెటింగ్ అవసరమని చెప్పుకొచ్చారు. ఎకో టూరిజం మీద అవగాహన కల్పిస్తే ఆదాయ వృద్ధి చెందుతుందని సూచించారు. యువతలో నిరుద్యోగం లేకుండా చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో సినిమాలు, సీరియళ్ల షూటింగ్ జరిగేలా ప్రోత్సహించాలని సూచించారు.


