అభివృద్ధి, పెట్టుబడుల విషయంలో బెంగళూరుతో హైదరాబాద్ నగరం పోటీపడుతోందని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. ఈ రెండు మహానగరాలు ప్రపంచంతో పోటీపడుతున్నా యన్నారు. ఫ్యూచర్‌సిటీలో నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్‌లో ఆయన ప్రసంగించారు. తర్వాత తరానికి ఏం కావాలో ఈ ప్రభుత్వం ఆలోచించిందన్నారు. తెలంగాణ, సౌత్ ఇండియా అభివృద్ధికి కర్ణాటక సహకరిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం దక్షిణ భారత అభివృద్ధికి కర్ణాటక సహకరిస్తుందని హామీ ఇచ్చారు. తెలంగాణ ఐటీ రంగంలో కూడా గణనీయమైన వాటాను కలిగి ఉందని, అలాగే 13 లక్షల మంది భారతీయ ఇంజినీర్లు ప్రపంచంలోని కాలిఫోర్నియా వంటి దేశీయ, అంతర్జాతీయ నగరాల్లో పనిచేస్తున్నారని వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండేళ్ల సేవల సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు మరియు ముఖ్యమంత్రి మరింత స్థిరంగా పాలన కొనసాగించాలని సూచించారు.


