త్రిగుణ్, హెబ్బాపటేల్ జంటగా నటిస్తున్న హారర్ థిల్లర్ ఈషా. శ్రీనివాస్ మన్నె దర్శకత్వం వహించిన ఈ మూవీ ట్రైలర్‌ను లాంచ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్‌ను గమనిస్తే, ఇప్పటి వరకు వచ్చిన రెగ్యులర్ హారర్ థ్రిల్లర్ జానర్‌లో ఇదొక ఆసక్తికరమైన పాయింట్‌తో అల్లుకున్న భయపెట్టే కథ అనిపిస్తుంది. సినిమా రెగ్యులర్ హారర్ ఫార్ములాకు భిన్నంగా ఉండేలా కనిపిస్తుంది. మీరు ఊహించని చీకటి ప్రపంచం మరొకటి ఉంది అని ట్రైలర్ ఆసక్తికరంగా మొదలవుతుంది. ఈ ట్రైలర్‌ను చూస్తుంటే ప్రేక్షకులు ఉలిక్కిపడే ట్విస్ట్‌లు పుష్కలంగా ఉన్నాయనిపిస్తుంది. దెయ్యాలు, ఆత్మలు లేవని బలంగా నమ్మే స్నేహితుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. సమాజంలో ఉన్న మూఢనమ్మకాలను, దొంగ బాబాలను ఎక్స్ పోజ్ చేయడానికి బయలుదేరిన వీరికి, బాబ్లూ పృథ్వీరాజ్ రూపంలో ఒక సవాలు ఎదురవుతుంది. ఆత్మలు ఉన్నాయని నిరూపిస్తే, అంటూ ఆయన విసిరే ఛాలెంజ్ తో వీరు ఒక చీకటి ప్రపంచంలోకి అడుగుపెడతారు. సైన్స్‌కు, అతీంద్రియ శక్తులకు మధ్య జరిగే క్లాష్ దీన్ని ఆసక్తికరంగా మలిచారు. ట్రైలర్‌లోని విజువల్స్ చాలా వరకు బ్లూ అండ్ డార్క్ థీమ్‌లో సాగాయి. ఈ చిత్రాన్నిడిసెంబర్ 12న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు.


