భారతీయ సినిమా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన పేరు, సుప్రసిద్ధ దర్శకుడు, నటుడు, నిర్మాత అయిన దిగ్గజ చలనచిత్రకారుడు వి. శాంతారామ్ జీవితం ఇప్పుడు వెండితెరపై ఆవిష్కృతం కానుంది. ఆయన అద్భుతమైన సినీ ప్రయాణం ఆధారంగా బాలీవుడ్‌లో ఒక భారీ బయోపిక్ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ఈ బయోగ్రాఫికల్ డ్రామాకు ఆయన పేరునే వి. శాంతారామ్ గా ఖరారు చేశారు మేకర్స్. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో టైటిల్ పాత్ర (వి. శాంతారామ్ పాత్ర)లో ప్రముఖ బాలీవుడ్ యువ నటుడు సిద్దాంత్ చతుర్వేది నటించబోతుండగా, అభిజీత్ శిరీష్ దేశ్‌పాండే దర్శకత్వం వహించనున్నారు. ఇప్పటికే మూవీ నుంచి సిద్దాంత్ చతుర్వేది ఫస్ట్ లుక్‌ని విడుదల చిత్రబృందం తాజాగా కథానాయికను పరిచయం చేసింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా తమన్నా నటించబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా తమన్నా భాటియా ఫస్ట్‌లుక్‌ని చిత్రబృందం విడుదల చేసింది. ఈ బయోపిక్‌ను రాహుల్ కిరణ్ శాంతారామ్, సుభాష్ కాలే మరియు సరిత అశ్విన్ వర్దే సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


