నందమూరి బాలకృష్ణ హీరోగా హీరోగా నటిస్తున్న చిత్రం అఖండ 2. థియేటర్ల వద్ద రికార్డుల వేట కొనసాగుతుండగానే, ఢిల్లీ నుంచి వచ్చిన ఓ వార్త సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాను స్వయంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ వీక్షించే అవకాశం ఉందన్న ప్రచారం ఆసక్తిని రేకెత్తిస్తోంది.ఈ విషయాన్ని దర్శకుడు బోయపాటి శ్రీను స్వయంగా వెల్లడించడం విశేషం. హైదరాబాద్‌లో నిర్వహించిన అఖండ 2 సక్సెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ కోసం ఢిల్లీలో స్పెషల్ స్క్రీనింగ్ ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. మోదీ గారు ఇప్పటికే ఈ సినిమా గురించి విన్నారని, చూడటానికి ఆసక్తి వ్యక్తం చేశారని బోయపాటి వెల్లడించారు. త్వరలోనే దీనికి సంబంధించిన డేట్, పూర్తి వివరాలు ప్రకటిస్తామని తెలిపారు. ప్రధాని ఈ సినిమాపై ఆసక్తి చూపించడానికి ప్రధాన కారణం ఇందులోని కాన్సెప్ట్ అని చిత్రబృందం భావిస్తోంది.


