రంగారెడ్డి జిల్లా చేగూరులోని కన్హా శాంతి వనాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సందర్శించారు. వనానికి విచ్చేసిన ముఖ్యమంత్రికి శ్రీరామచంద్ర మిషన్ అధ్యక్షుడు కమలేష్ డి పటేల్ ఘన స్వాగతం పలికారు. శాంతి వనాన్ని సందర్శించిన తరువాత దాజీతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కన్హా శాంతి వనంలో హార్ట్ ఫుల్నెస్ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలను గురించి చర్చించారు. శాంతి వనంలో జరుగుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గురించి ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. ప్రకఅతి, పర్యావరణం, వ్యవసాయం, ధ్యానం, యోగా శిక్షణపై చంద్రబాబుకు దాజీ వివిధ అంశాలను వివరించారు. ఎపిలో హార్ట్ ఫుల్నెస్ కార్యాలయం ఏర్పాటు చేయడంపై దాజీతో ముఖ్యమంత్రి సమాలోచనలు చేశారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో మొత్తం 1400 ఎకరాల్లో కన్హా శాంతి వనాన్ని శ్రీరామచంద్ర మిషన్ అభివృద్ధి చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద మెడిటేషన్ సెంటర్ ను ఈ ఆశ్రమంలో ఉంది. 8 లక్షలకు పైగా వివిధ జాతుల వృక్షాలతో బయోడైవర్సిటీ కేంద్రంగా ఈ ఆశ్రమం పెద్దఎత్తున పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది.


