My Telugu NRI

Mobile Scrollable Menu
- Cinema - Latest News

ఈ సినిమా మీ అందరికి నచ్చుతుంది : సూర్య శ్రీనివాస్

సూర్య శ్రీనివాస్‌, సంజీవ్‌ కుమార్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం జమాన. భాస్కర్‌ జక్కుల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తేజస్వి అడప, బొద్దుల లక్ష్మణ్‌, శివకాంత్‌, శశికాంత్‌ నిర్మాతలు. ఈ చిత్ర ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు భాస్కర్‌ జక్కుల మాట్లాడుతూ ఈ సినిమా డిఫరెంట్‌గా ఉంటుంది. మంచి థ్రిల్లర్‌ సబ్జెక్ట్‌తో ఈ సినిమా తీశాం. ఆద్యంతం వినోదంతో పాటు ఊహించని ట్విస్ట్‌లు ఈ సినిమాలో ఉంటాయి అని తెలిపారు. ఈ సినిమాను […]

సూర్య శ్రీనివాస్‌, సంజీవ్‌ కుమార్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం జమాన. భాస్కర్‌ జక్కుల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తేజస్వి అడప, బొద్దుల లక్ష్మణ్‌, శివకాంత్‌, శశికాంత్‌ నిర్మాతలు. ఈ చిత్ర ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు భాస్కర్‌ జక్కుల మాట్లాడుతూ ఈ సినిమా డిఫరెంట్‌గా ఉంటుంది. మంచి థ్రిల్లర్‌ సబ్జెక్ట్‌తో ఈ సినిమా తీశాం. ఆద్యంతం వినోదంతో పాటు ఊహించని ట్విస్ట్‌లు ఈ సినిమాలో ఉంటాయి అని తెలిపారు. ఈ సినిమాను దర్శకుడు భాస్కర్‌ చాలా గ్రిప్పింగ్‌ స్క్రీన్‌ ప్లేతో నడిపించారు. సినిమా తప్పకుండా అందరిని అలరిస్తుందని నమ్ముతున్నాను అని నిర్మాత శివకాంత్‌ చెప్పారు.

హీరో సూర్య శ్రీనివాస్ సంజీవ్‌ కుమార్‌ మాట్లాడుతూ కష్టపడి చేసిన ఈ సినిమా జనవరి 30న థియేటర్స్‌లో విడుదల కాబోతోంది. ఈ సినిమా మీ అందరికి నచ్చుతుందని నమ్ముతున్నాం అని అన్నారు. నేటి యువతరం ఆలోచనలకు అద్దం పట్టే చిత్రమిది. హైదరాబాద్‌ పాతబస్తీ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. చక్కటి వినోదంతో ఆకట్టుకుంటుం. నేటి యూత్‌కి కనెక్ట్‌ అయ్యే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయి అని చిత్రయూనిట్‌ తెలిపింది. స్వాతి కశ్యప్‌, జారా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జగన్‌ ఏ, ఎడిటింగ్‌: ఎం.ఆర్‌.వర్మ, సంగీతం: కేశవ కిరణ్‌, రచన-దర్శకత్వం: భాస్కర్‌ జక్కుల.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.