ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జున కృష్ణా జిల్లా గుడివాడలో ఏఎన్నార్ కళాశాల వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థుల స్కాలర్‌షిప్‌ల కోసం అక్కినేని కుటుంబం తరుఫున రూ.2 కోట్లను అందజేశారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ నా తల్లిదండ్రులైన అక్కినేని నాగేశ్వరరావు , అన్నపూర్ణ అక్కినేని జ్ఞాపకార్థం అక్కినేని కుటుంబం ఏఎన్ఆర్ కళాశాలలో రూ.2 కోట్లతో స్కాలర్షిప్ నిధిని ఏర్పాటు చేస్తున్నాం. ఈ నిర్ణయం నాతోపాటు నా సోదరి సుశీల, సోదరుడు వెంకట్, మొత్తం ఏఎన్ఆర్ కుటుంబం కలిసి తీసుకున్నాం. ఈ నిధిని సరైన పద్ధతిలో అమలు చేయడానికి మేము ఏఎన్ఆర్ కళాశాల యాజమాన్యంతో కలిసి పని చేస్తాము. 1959 సంవత్సరంలో రూ.లక్ష విరాళం అందించారని గుర్తు చేశారు. ఆయన వారసత్వాన్ని కొనసాగించడం మా బాధ్యత అని అన్నారు. మనుషులు శాశ్వతం కాదని, మనం చేసే పనులు శాశ్వతమని అన్నారు. తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు చదువుకోకపోయినా వేల మందికి బంగారు భవిష్యత్‌ను ఇచ్చారని పేర్కొన్నారు.


