భారత సైనిక అకాడమీలో 23 ఏళ్ల మహిళా ఆఫీసర్ సాయి జాదవ్ చరిత్ర సృష్టించింది. ఐఎంఏ నుంచి పాసౌట్ అయిన తొలి మహిళా టెరిటోరియల్ ఆఫీసర్‌గా ఆమె రికార్డు క్రియేట్ చేసింది. 157వ కోర్సుకు చెందిన పాసింగ్ ఔట్ పరేడ్‌ను గత వారం నిర్వహించారు. ఆ ఈవెంట్లో సాయీ జాదవ్‌కు లెఫ్టినెంట్ హోదాను కల్పిస్తూ కమీషన్ చేశారు. సాయీ జాదవ్‌ది మహారాష్ట్రలోని కోల్హాపూర్. అయితే 93 ఏళ్ల అకాడమీ చరిత్రలో ఓ మహిళ, టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసర్‌గా పాసవుట్ కావడం ఇదే మొదటిసారి.
మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఈ సందర్భంగా ఆ ఆఫీసర్‌కు కంగ్రాట్స్ తెలిపారు. ఆమె సాధించిన ఘనత అందరికీ ఆదర్శప్రాయమైందని పేర్కొన్నారు. దేశంలోని అసంఖ్యాకంగా ఉన్న మహిళలకు ఆమె ప్రేరణగా నిలుస్తుందన్నారు. ఐఎంఏను 1932లో స్థాపించారు. ఆ అకాడమీకి 93 ఏళ్ల చరిత్ర ఉన్నది. ఎంతో మంది మేటి ఆర్మీ ఆఫీసర్లను ఆ అకాడమీ తయారు చేసింది. అయితే ఆ అకాడమీ నుంచి ఓ మహిళా ఆఫీసర్ టాప్‌లో నిలవడం ఇదే తొలిసారి .


