వచ్చే ఏడాది జనవరి 26వ తేదీన జరగబోయే గణతంత్ర దినోత్సవ వేడుకలకు యూరోపియన్ యూనియన్ నేతలు రాబోతున్నట్టు సమాచారం. ప్రతి సంవత్సరం జనవరి 26న నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఏదో ఓ దేశాధినేతని భారత్ ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తోంది. తొలిసారిగా బహుళ-దేశాల కూటమికి చెందిన నాయకులు భారత్ రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరుకాబోతున్నట్టు తెలుస్తోంది.
యూరోపియన్ యూనియన్‌తో భారత్ అతిపెద్ద వాణిజ్య ఒప్పందం ఖరారయ్యే దశలో ఉంది. అలాగే భారత్-ఈయూ మధ్య వ్యూహాత్మక భాగస్వామం ఉంది. ఈ నేపథ్యంలో 2026 జనవరి 26న జరిగే గణతంత్ర వేడుకలకు యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టాను ఆహ్వానించినట్టు తెలుస్తోంది.


