శబరిమల అయ్యప్ప ఆలయం లోని బంగారు విగ్రహాల దుర్వినియోగం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో పూర్తిస్థాయి దర్యాప్తు చేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు కొల్లాం విజిలెన్స్ కోర్టు అనుమతిచ్చింది. కేసులో కీలక పత్రాలు, సాక్షుల వాంగ్మూలాలు సహా సంబంధిత దస్త్రాలను ఈడీకి అప్పగించాలని సిట్‌ను ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటివరకు నమోదైన రెండు ఎఫ్ఐఆర్ కాపీలు, అరెస్టైన ఏడుగురు నిందితులకు సంబంధించి సిట్ దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులు సహా ఇతర కీలక దస్త్రాలను ఈడీకి తక్షణమే ఇవ్వాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నది. ఈడీ దీనిపై మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయనుంది.


