My Telugu NRI

Mobile Scrollable Menu
- Andhra - Latest News

ఇది నా పూర్వజన్మ సుకృతం : రామ్మోహన్ నాయుడు

భీమవరం అంటే పల్లెటూరి ఆప్యాయత ఉన్న పట్టణమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు  అన్నారు. ఉండి బైపాస్ రోడ్డు వద్ద మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహాన్ని కేంద్రమంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు  మాట్లాడుతూ వాజ్‌పేయి విగ్రహ ఆవిష్కరణ తన పూర్వజన్మ సుకృతమన్నారు. ఏ దేశానికి వెళ్ళినా తాము భారతదేశం నుంచి వచ్చామని అంటే సెల్యూట్ చేసే పరిస్థితి ఉందన్నారు. నేటి యువతరం వాజ్‌పేయి గురించి తెలుసుకోవలసిన అవసరం ఉందని తెలిపారు. ఒక్క […]

భీమవరం అంటే పల్లెటూరి ఆప్యాయత ఉన్న పట్టణమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు  అన్నారు. ఉండి బైపాస్ రోడ్డు వద్ద మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహాన్ని కేంద్రమంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు  మాట్లాడుతూ వాజ్‌పేయి విగ్రహ ఆవిష్కరణ తన పూర్వజన్మ సుకృతమన్నారు. ఏ దేశానికి వెళ్ళినా తాము భారతదేశం నుంచి వచ్చామని అంటే సెల్యూట్ చేసే పరిస్థితి ఉందన్నారు. నేటి యువతరం వాజ్‌పేయి గురించి తెలుసుకోవలసిన అవసరం ఉందని తెలిపారు.

ఒక్క ఓటుతో పదవి పోతుంటే ప్రజాస్వామ్యంగా బ్రతకాలని పార్లమెంటులో చెప్పిన వ్యక్తి వాజ్‌పేయి అని అన్నారు. మన హైవేలను నాలుగు లైన్ల స్వర్ణ చుతుర్జుజిగా మార్చిన ప్రధాని వాజ్‌పేయి అని చెప్పుకొచ్చారు. వాజ్‌పేయి నార్త్ ఈస్ట్ అభివృద్ధి చెందాలని మొట్టమొదటగా మినిస్ట్రీ పెట్టారని గుర్తు చేశారు. 25న వాజ్‌పేయి 101 జయంతి సందర్భంగా విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విగ్రహావిష్కరణ చేస్తున్నారని తెలిపారు. ఎన్డీఏ ఎలైన్స్ అంటే పెద్ద పార్టీ అయినా చిన్న పార్టీ అయినా సముచిత స్థానం ఇచ్చిన వ్యక్తి వాజ్‌పేయి అని అన్నారు. గతంలో ఐదు సంవత్సరాలు పళ్ళు వచ్చే విధంగా చెట్టును పెంచితే, చెట్టును నరికేసే కసాయి వచ్చిన పరిస్థితి వచ్చిందని పరోక్షంగా జగన్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు అని  పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.