క్రిస్మస్ సందర్భంగా అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులకు ట్రంప్ యంత్రాంగం బంపర్ ఆఫర్ ప్రకటించింది. యూఎస్‌ను స్వతంత్రంగా వీడితే ఇచ్చే బోనస్‌ను మూడు రెట్లు పెంచింది. డిసెంబర్ 31లోపు యూఎస్‌ను స్వతంత్రంగా వీడితే బోనస్‌గా 3వేల డాలర్లు ఇవ్వనున్నట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) విభాగం ప్రకటించింది. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.2,70,738 అన్నమాట. ఇంతకుముందు ఈ బోనస్ 1000 డాలర్లుగా ఉండేది. అంతేకాకుండా బోనస్తోపాటూ స్వదేశానికి వెళ్లేందుకు ఉచిత విమాన టికెట్ సదుపాయం కూడా కల్పించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు డీహెచ్ఎస్ ఓ ప్రకటన విడుదల చేసింది. యూఎస్‌ను స్వచ్ఛందంగా వీడేవారు సీబీపీ హోమ్ యాప్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించింది. ఆ తర్వాత స్వదేశానికి వెళ్లేందుకు పూర్తి ఏర్పాట్లు, బోనస్ చెల్లించడం వంటివన్నీ డీహెచ్ఎస్ చూసుకుంటుందని పేర్కొంది.


