బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖాలిదా జియా కుమారుడు, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ తాత్కాలిక చైర్మన్ తారిక్ రెహమాన్ ఎట్టకేలకు స్వదేశంలో అడుగుపెట్టారు. దాదాపు 17 ఏండ్ల తర్వాత ఢాకా చేరుకున్నారు. ఈ సందర్భంగా రెహమాన్, అతని కుటుంబ సభ్యులకు ఢాకా విమానాశ్రయంలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ మద్దతుదారులు ఘనంగా స్వాగతం పలికారు. కాగా, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బంగ్లాదేశ్‌లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ప్రధాని రేసులో తారిక్ ముందు వరుసలో ఉన్నారు.


