My Telugu NRI

Mobile Scrollable Menu
- Cinema - Latest News

మన శంకరవరప్రసాద్‌గారు సాంగ్ ప్రోమో రిలీజ్

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ సంక్రాంతికి అసలైన పూనకాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం మన శంకరవరప్రసాద్ గారు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ఒక కీలకమైన అతిథి పాత్రలో మెరవనుండటంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుండ‌గా,  తాజాగా సినిమా నుంచి మాస్ అప్‌డేట్‌ను పంచుకుంది చిత్ర‌యూనిట్. ఈ సినిమా నుంచి ఆర్ యూ రెడీ […]

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ సంక్రాంతికి అసలైన పూనకాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం మన శంకరవరప్రసాద్ గారు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ఒక కీలకమైన అతిథి పాత్రలో మెరవనుండటంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుండ‌గా,  తాజాగా సినిమా నుంచి మాస్ అప్‌డేట్‌ను పంచుకుంది చిత్ర‌యూనిట్. ఈ సినిమా నుంచి ఆర్ యూ రెడీ అంటూ సాగే పాట ప్రోమోను చిత్ర‌బృందం విడుద‌ల చేసింది. ఈ పాట‌లో చిరంజీవి తన మార్క్ గ్రేస్‌తో, వెంకటేష్ తనదైన స్టైల్‌తో సందడి చేస్తున్నారు. ఈ సాంగ్ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ కంప్లీట్ మాస్ సాంగ్‌ను డిసెంబర్ 30న విడుదల చేయనున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.