ఏపీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు ను నియమించటం జరిగింది. ఆయనను ముఖ్యంగా ప్రభుత్వానికి ప్రకృతి వైద్య సలహాదారుగా నియమించడం జరిగింది. ఈ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయడంతో అధికారికత పొందింది. రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగే అవకాశం ఉ డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు ప్రభుత్వం తీసుకునే ఆరోగ్య, సహజ చికిత్సా విధానాలపై సలహాలు, మార్గదర్శకత్వం అందిస్తారు. రాష్ట్రంలో ప్రజారోగ్య పరిపాలన, ప్రత్యామ్నాయ వైద్య విధానాలను ప్రోత్సహించడం ఆయన ముఖ్య బాధ్యతగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.


