బంగ్లాదేశ్లో విద్యార్థి నాయకుడు ఇంకిలాబ్ మోంచా నేత షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్యతో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాత్కాలిక ప్రభుత్వంపై ఇంకిలాబ్మోంచా ఆగ్రహం వ్యక్తం చేస్తూ 24 రోజుల్లోగా తమ నాలుగు డిమాండ్లు నెరవేర్చాలని అల్టిమేటమ్ జారీ చేసింది. ఈ డిమాండ్లలో ఒకటి బంగ్లాలోఉన్న భారతీయుల వర్క్ పర్మిట్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది. హాదీ హత్యతో ప్రమేయం ఉన్న ప్రతిఒక్కరిపైనా దర్యాప్తు పూర్తి చేయాలని డిమాండ్ చేసింది. హంతకునితోపాటు, హత్యకు సూత్రధారి, సహాయం చేసినవారు, వారు తప్పించుకోడానికి సహాయం చేసిన వారు, ఆశ్రయం ఇచ్చిన వారితో సహా ప్రతిఒక్కరినీ దర్యాప్తు చేసి న్యాయం ముందు నిలబెట్టాలని ఇంకిలాబ్మోంచా డిమాండ్ చేసింది.


