ఆంధ్రప్రదేశ్ గ్రూప్-2 అభ్యర్థులకు బిగ్ రిలీఫ్ దక్కింది. గ్రూప్-2 రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. కాగా, 2023లో విడుదలైన గ్రూప్-2 నోటిఫికేషన్‌పై రిజర్వేషన్ల విధానాన్ని సవాల్ చేస్తూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వేషన్ రోస్టర్‌ను పాటించాలని కోరుతూ అభ్యర్థులు పిటిషన్లు దాఖలు చేశారు. 2023లో విడుదలైన గ్రూప్-2 నోటిఫికేషన్‌ను రద్దు చేసి, పాత నోటిఫికేషన్‌కు బదులు కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలని అభ్యర్థులు కోరారు. రిజర్వేషన్ల పాయింట్లను సవాల్ చేస్తూ, ప్రభుత్వ నిర్ణయాలు సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండాలని పేర్కొన్నారు. ఈ విషయంపై విచారణ జరిపిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, రిజర్వేషన్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను తిరస్కరించింది.


