ఇండియా, పాకిస్థాన్ మధ్య ఆపరేషన్ సిందూర్ సమయంలో ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఇండోపాక్ మధ్య శాంతి నెలకొల్పేందుకు తాము మధ్యవర్తిత్వం వహించినట్లు చైనా ప్రకటించింది. చైనా వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. పాక్‌తో కాల్పుల విరమణలో మూడో పక్షం జోక్యం లేదని స్పష్టం చేసింది. ఆపరేషన్ సిందూర్ తర్వాత మే 10న జరిగిన కాల్పుల విరమణ, రెండు దేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ మధ్య ప్రత్యక్ష చర్చల ద్వారా కుదిరిందని వెల్లడించింది. మేము ఇప్పటికే అలాంటి వాదనలను తోసిపుచ్చాము. భారత్-పాక్ మధ్య సమస్యల పరిష్కారానికి మూడో పక్షం ప్రమేయం లేదు. రెండు దేశాల డీజీఎమ్‌వోలు నేరుగా సంప్రదింపులు జరిపి కాల్పుల విమరణ ఒప్పందాన్ని అంగీకరించారు. ఈ విషయంపై గతంలో అనేక సందర్భాల్లో మా వైఖరిని స్పష్టం చేశాము అని ప్రభుత్వం స్పష్టం చేసింది.


