My Telugu NRI

Mobile Scrollable Menu
- Cinema - Latest News

అందుకే సంక్రాంతికి వస్తున్నాం

ఈ సంక్రాంతికి అనగనగా ఒక రాజు చిత్రంతో వినోదాల విందును పంచడానికి సిద్ధమవుతున్నారు నవీన్‌ పొలిశెట్టి. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి మారి దర్శకత్వం వహిస్తున్నారు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్నది. ఈ సందర్భంగా మంగళవారం రాజుగారి పెళ్లి రిసెప్షన్‌ వేడుక్ణ పేరుతో ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకలో నాయకానాయికలు నవీన్‌ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నూతన వధూవరుల గెటప్‌లో వేదికపై సందడి చేశారు. నవీన్‌ పొలిశెట్టి మాట్లాడుతూ సంక్రాంతి సినిమా అంటేనే వినోదం.అందులో ఓ […]

ఈ సంక్రాంతికి అనగనగా ఒక రాజు చిత్రంతో వినోదాల విందును పంచడానికి సిద్ధమవుతున్నారు నవీన్‌ పొలిశెట్టి. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి మారి దర్శకత్వం వహిస్తున్నారు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్నది. ఈ సందర్భంగా మంగళవారం రాజుగారి పెళ్లి రిసెప్షన్‌ వేడుక్ణ పేరుతో ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకలో నాయకానాయికలు నవీన్‌ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నూతన వధూవరుల గెటప్‌లో వేదికపై సందడి చేశారు. నవీన్‌ పొలిశెట్టి మాట్లాడుతూ సంక్రాంతి సినిమా అంటేనే వినోదం.అందులో ఓ వైబ్‌ ఉంటుంది. ఇంటిల్లిపాది కలిసి చూసేలా ఆద్యంతం సంపూర్ణ హాస్యంతో ఈ సినిమా తీశాం. ఈ సంక్రాంతి బరిలో నిలుస్తున్న చిత్రాలన్నీ విజయం సాధించాలని, తెలుగు సినిమా సౌండ్‌ ప్రపంచవ్యాప్తంగా వినిపించాలని కోరుకుంటున్నా అన్నారు. ఇది తనకు మూడో సంక్రాంతి చిత్రమని, చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లా అలరిస్తుందని కథానాయిక మీనాక్షి చౌదరి తెలిపింది. ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది.  ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే మేయర్‌, నిర్మాణ సంస్థ: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌, దర్శకత్వం: మారి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.