రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ది రాజా సాబ్. సంక్రాంతి కానుకగా ఈ నెల 9న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. విడుదలకు మరో ఎనిమిది రోజుల సమయం మాత్రమే ఉండటంతో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా నూతన సంవత్సరం సందర్భంగా ప్రభాస్ అభిమానులకు చిత్ర యూనిట్ ఓ మ్యూజికల్ సర్ ప్రైజ్ ఇచ్చింది. క్రిస్మస్ సందర్భంగా ప్రోమోతో ఆకట్టుకున్న రాజే యువరాజే పాట ఫుల్ లిరికల్ వీడియోను న్యూ ఇయర్ గిఫ్ట్‌గా మేకర్స్ తాజాగా విడుదల చేశారు. రాజే యువరాజే.. కొలిచేటి తొలి ప్రేమికుడే.. నడిపించేది అతడేు అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్ వినసొంపుగా ఉంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.


