జర్మనీలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో తెలంగాణకు చెందిన ఓ యువ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. జనగామ జిల్లా చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన తోకల హృతిక్ రెడ్డి అక్కడ ఉన్నత చదువుల కోసం వెళ్లాడు.తాను నివసిస్తున్న భవనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో హృతిక్ రెడ్డి భవనంలోనే ఉండగా, బయటపడేందుకు ప్రయత్నించినప్పటికీ ప్రాణాంతక గాయాలకు గురై మృతిచెందాడు.ఈ విషాద ఘటన వార్త తెలిశాక అతని స్వగ్రామమైన మల్కాపూర్‌లో తీవ్ర దిగ్బంధ వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి.


