మావోయిస్టు పార్టీకి మరో ఎదరుదెబ్బ తగిలింది. ఇటీవల కాలంలో అనేక మంది మావోయిస్టు నేతల పోలీసుల ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి మావోయిస్టు పార్టీకి గట్టి షాక్ తగిలింది. మరో కీలక నేత పోలీసుల ముందు లొంగిపోయారు. మావోయిస్టు ముఖ్య నేత బర్సే దేవా, డీజీపీ శివధర్ రెడ్డి ముందు లొంగిపోయారు. దేవా మావోయిస్టు పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్‌గా పనిచేస్తున్నారు. మావో అధినేత హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీ సాయిధ బలగాల వ్యవహారాలను బర్సే దేవా చూస్తున్నారు. హిడ్మా, బర్సే దేవా ఒకే గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. మావోయిస్టు పార్టీకి ఆయుధాల సరఫరాలో దేవా అత్యంత కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు డీజీపీ ముందు దేవా లొంగిపోగా, అతడి నుంచి మౌంటెన్ ఎల్ఎంజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దేవాతో పాటు మిల్ట్రీ ఆపరేషన్ సభ్యులు కూడా సరెండర్ అయ్యారు.


