రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం భర్త మహాశయులకు విజ్ఞప్తి. కిషోర్ తిరుమల దర్శకత్వం. రవితేజ సరసన ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతీ కథానాయికలుగా నటిస్తున్నారు. అయితే ప్రచార కార్యక్రమాల్లో భాగంగా మేకర్స్ తాజాగా ఈ సినిమాలోని వామ్మో.. వాయ్యో అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియా తనదైన మాస్ బీట్స్‌తో స్వరపరిచిన ఈ పాటకు దేవ్ పవార్ సాహిత్యం అందించగా, స్వాతిరెడ్డి తన గాత్రంతో పాటకు మరింత హుషారుని తీసుకువచ్చారు. ఈ చిత్రం కిషోర్ తిరుమల మార్కు ఎమోషన్స్‌తో పాటు, రవితేజ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా సాగే పక్కా కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోంది. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.


