ప్రముఖ బ్రిటిష్ ఇండియన్ నటి, రచయిత్రి, నాటకకర్త మీరా సియాల్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. 64 ఏళ్ల మీరా సియాల్‌కు ప్రతిష్ఠాత్మక డేమ్‌హుడ్ అవార్డు లభించింది. కొత్త సంవత్సరాది సందర్భంగా బ్రిటన్‌లో కింగ్ చార్లెస్-3 ప్రదానం చేసే అత్యున్నత పురస్కారాల్లో ఇదొకటి. సాహిత్యం, నాటకం, దాతృత్వ రంగాల్లో ఆమె అందించిన సేవలకు గాను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. లండన్‌లో డిసెంబరు 30న అవార్డు గ్రహీతల జాబితాను విడుదల చేశారు. మీరా సియాల్ గుడ్‌నెస్ గ్రేషియస్ మి, ది కుమార్స్ ఎట్ నం.42 వంటి కామెడీ సిరీస్‌ల ద్వారా గుర్తింపు పొందారు. చిన్ననాటి నుంచే సాహిత్యం, నటనపై ఆసక్తి పెంచుకున్న ఆమె, ఆ తర్వాత కాలంలో బ్రిటన్ టెలివిజన్, థియేటర్, సాహిత్య రంగాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.


