My Telugu NRI

Mobile Scrollable Menu
- Andhra - Latest News

మంత్రి నారాయణ కీలక ప్రకటన .. ఏప్రిల్‌ నాటికి పూర్తి చేస్తాం

అమరావతి క్యాపిటల్ సిటీలో నిర్మిస్తున్న రాష్ట్ర మంత్రులు, ఐఏఎస్ అధికారులు, జడ్జిల నివాస భవనాలపై మంత్రి నారాయణ  కీలక ప్రకటన చేశారు. నివాస భవనాల పనులు ఈ ఏప్రిల్‌లో పూర్తి చేసి హ్యాండ్ ఓవర్ చేయనున్నట్లు తెలిపారు. అమరావతిలో మొత్తం 4,026 భవనాలు, ఫ్లాట్లు నిర్మించబడుతున్నాయని చెప్పారు. వీటిలో 186 బంగ్లాలు ఉండగా, మిగతా 3,850 భవనాలు అపార్ట్‌మెంట్ మోడల్లో నిర్మాణం జరుగుతున్నట్లు తెలిపారు. ఈ ఏడాది వర్షాలు ఎక్కువగా రావడం వల్ల కొన్ని పనులు ఆలస్యం […]

అమరావతి క్యాపిటల్ సిటీలో నిర్మిస్తున్న రాష్ట్ర మంత్రులు, ఐఏఎస్ అధికారులు, జడ్జిల నివాస భవనాలపై మంత్రి నారాయణ  కీలక ప్రకటన చేశారు. నివాస భవనాల పనులు ఈ ఏప్రిల్‌లో పూర్తి చేసి హ్యాండ్ ఓవర్ చేయనున్నట్లు తెలిపారు. అమరావతిలో మొత్తం 4,026 భవనాలు, ఫ్లాట్లు నిర్మించబడుతున్నాయని చెప్పారు. వీటిలో 186 బంగ్లాలు ఉండగా, మిగతా 3,850 భవనాలు అపార్ట్‌మెంట్ మోడల్లో నిర్మాణం జరుగుతున్నట్లు తెలిపారు.

ఈ ఏడాది వర్షాలు ఎక్కువగా రావడం వల్ల కొన్ని పనులు ఆలస్యం అయ్యాయని, అయితే ఇప్పుడు అన్ని నిర్మాణాలను పూర్తి చేయడానికి చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. మంత్రుల బంగ్లాలు చాలా వరకు పూర్తయ్యాయన్నారు. జడ్జీల బంగ్లాల్లో బ్రిక్ వర్క్, ప్లాస్టింగ్ తుద దశకు చేరిందని, అఖిల భారత సర్వీసు అధికారుల టవర్స్ కూడా తుది దశకు చేరాయని చెప్పారు. 500 నివాస సముదాయాలను మినహా, మిగతా భవనాలు మార్చి ముగింపు వరకు పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అన్ని భవనాలు పూర్తైన తర్వాత జీఏడీకి హ్యాండ్ ఓవర్ చేస్తామని, వారు కేటాయిస్తారని మంత్రి తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.