రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం భర్త మహాశయులకు విజ్ఞప్తి. కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం, సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ దగ్గర పడుతుండటంతో సినిమా ప్రమోషన్స్ శరవేగంగా సాగుతున్నాయి. తాజాగా చిత్ర ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ఇద్దరి భామల మధ్య నలిగిపోతున్న వ్యక్తిగా రవితేజ తన కామెడీతో తెగ నవ్విస్తున్నాడు. ప్రస్తుతం ఈ ట్రైలర్ ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తుంది. ఈ ట్రైలర్ చూశాక ఫ్యాన్స్ మూవీ హిట్ అంటున్నారు. ఈ సినిమాలో రవితేజ సరసన ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సునీల్, సత్య, వెన్నెల కిశోర్, సుధాకర్, మురళీధర్ గౌడ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. బీమ్స్ సిసిరిలియో సంగీతం అందించగా, ఏ. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.


