మెరుగైన పని పరిస్జితులను కల్పించాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది నర్సులు న్యూయార్క్ నగరంలో సమ్మె బాట పట్టారు. అమెరికాలోని అతిపెద్దనగరమైన మౌంట్ సినారు, మాంటెఫియోర్, న్యూయార్క్ ప్రెస్బిటేరియన్‌లోని మూడు ప్రైవేటు ఆసుపత్రుల్లోని దాదాపు 15వేల మంది నర్సులు తమ విధుల్లోకి వెళ్లకుండా నిష్క్రమించారు.
నర్సులకు ఆరోగ్యసంరక్షణ ప్రయోజనాలు, మెరుగైన పని పరిస్థితులు, పని ప్రదేశాల్లో హింస నుంచి వారికి రక్షణ కల్పించుట, రోగులకు సురక్షితమైన సిబ్బంది నియామకంపై నెలల తరబడి ఆసుపత్రి యాజమాన్యాలతో చర్చలు జరిపాము. అయినాప్పటికీ ఈ డిమాండ్లకు ఆసుపత్రి యాజమాన్యాలు ఒప్పుకోకపోవడంతో సమ్మెకు పిలుపిచ్చినట్టు న్యూయార్క్ స్టేట్ నర్సింగ్ అసోసియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. న్యూయార్క్ నగరంలోని అత్యంత ధనిక ఆసుపత్రుల మేనేజ్‌మెంట్, నర్సుల ఆరోగ్య ప్రయోజనాలను నిలిపివేయడం లేదా, వాటికి కోత పెట్టడం చేస్తామని బెదిరిస్తున్నట్లు నర్సింగ్ గ్రూప్ వెల్లడించింది.


