ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి ఏర్పాటైన కమిటీ తొలి సమావేశం తేదీ ఖరారైంది. ఈ నెల 30న ఢిల్లీలోని సేవా భవన్లో ఈ భేటీ జరగనుంది. ఈ మేరకు ప్రాజెక్టు అప్రైజల్ ఆర్గనైజేషన్ (పీఏవో), సీడబ్ల్యూసీ సమావేశ నోటీసును జారీ చేసింది. పోలవరం ఉ నల్లమలసాగర్ ప్రాజెక్టు సహా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల నిర్వహణకు సంబంధించిన ప్రధాన సమస్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ( జిఆర్ఎంబి), కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కెఆర్ఎంబి) నుంచి అవసరమైన సమాచారాన్ని సేకరించనున్నారు. అవసరమైతే నిపుణులు, సీనియర్ ఇంజినీర్లను కమిటీకి సహాయకులుగా నియమించడం, ఇతరత్రా అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు పూర్తి సమాచారం, నివేదికలతో హాజరుకావాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.


