విజయ్ సేతుపతి హీరోగా, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. పూరి స్టైల్ మాస్ నేరేటివ్‌కి, విజయ్ సేతుపతి పవర్‌ఫుల్ యాక్టింగ్ కలిస్తే ఎలాంటి అవుట్‌పుట్ వస్తుందన్న ఆసక్తి సినీ వర్గాల్లో గట్టిగా కనిపించింది. కనుమ పండుగ సందర్భంగా, అలాగే విజయ్ సేతుపతి పుట్టినరోజు కానుకగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ అధికారికంగా విడుదల చేశారు. ఈ సినిమాకు స్లమ్ డాగ్ అనే ఇంట్రెస్టింగ్ అండ్ పవర్‌ఫుల్ టైటిల్‌ను లాక్ చేయగా, ఫస్ట్ లుక్ కూడా అదే స్థాయిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఫస్ట్ లుక్ పోస్టర్‌లో విజయ్ సేతుపతి ఓ అంధుని పాత్రలో కనిపించడం ప్రధాన ఆకర్షణగా మారింది. కళ్లకు చూపు లేని పాత్రలో ఉన్నప్పటికీ, చేతిలో కత్తి పట్టుకుని ఉన్న అతని లుక్ సినిమా కథలో బలమైన కాన్‌ఫ్లిక్ట్, ఇంటెన్స్ ఎమోషన్స్ ఉండబోతున్నాయనే సంకేతాన్ని ఇస్తోంది. సాధారణంగా చూసిన పాత్రలకు భిన్నంగా, పూర్తి స్థాయి పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్‌లో విజయ్ సేతుపతి కనిపించబోతున్నాడని ఫస్ట్ లుక్ స్పష్టంగా చెబుతోంది.


