భారత్‌లో కృత్రిమ మేధ(ఏఐ) సేవల కోసం అమెరికా వనరులను ఎందుకు ఉపయోగించాలని ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో ప్రశ్నించారు. పీటర్ నవారో మాట్లాడుతూ చాట్‌జీపీటీ లాంటి ఏఐ ప్లాట్‌ఫామ్స్ అమెరికా కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయని, అయితే వాటి యూజర్లు మాత్రం చైనా, భారత్‌లో ఎక్కువగా ఉన్నారని తెలిపారు. ఈ సేవల కోసం అమెరికా విద్యుత్తును ఎక్కువగా ఉపయోగిస్తున్నారన్నారు. ఇండియాలో ఏఐ కోసం అమెరికన్లు ఎందుకు చెల్లిస్తున్నారు అని ఆయన ప్రశ్నించారు. ఏఐ డాటా సెంటర్లు భారీగా విద్యుత్తును వినియోగించుకోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.


