తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో సుప్రీం కోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు సుప్రీం ధర్మాసనం మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో రాష్ట్ర బీజేపీ సుప్రీం న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, జస్టిస్ సంజయ్ కరోల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. గతంలో పెండింగ్‌లో ఉన్న కేసుతో బీజేపీ పిటిషన్‌ను కూడా జత చేసిన ధర్మాసనం, తదుపరి విచారణను ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది. సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం.. మూడు నెలల్లోపు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు సూచించినప్పటికీ, ఆ ఆదేశాలను అమలు చేయలేదని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో స్పీకర్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలని కోరుతూ తెలంగాణ బీజేపీ శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. అదేవిధంగా మహేశ్వర్‌రెడ్డి పిటిషన్‌ను పాడి కౌశిక్‌రెడ్డి, కేటీఆర్ పిటిషన్‌లతో జతచేసింది.


