మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సంక్రాంతి బ్లాక్‌బస్టర్ ‘మన శంకర వరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్‌ను ప్రధానంగా ఆకట్టుకునేలా రూపొందిన ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచే హౌస్‌ఫుల్ షోలను నమోదు చేస్తూ, అద్భుతమైన వసూళ్లతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా మొదటి వారం పూర్తయ్యే సరికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.292 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ఇదే జోరు కొనసాగితే, అతి త్వరలోనే రూ.300 కోట్ల క్లబ్‌లోకి ఈ చిత్రం అడుగుపెట్టడం ఖాయమని అంటున్నారు. ఈ స్థాయి వసూళ్లతో 2026 సంవత్సరానికి టాలీవుడ్‌కు అదిరిపోయే ఆరంభం లభించినట్టైంది.
సాహు గారపాటి, చిరంజీవి కుమార్తె సుస్మిత సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా, వాణిజ్యపరంగా నిర్మాతలకు భారీ లాభాలను అందిస్తోంది. కలెక్షన్ల జోరు కొనసాగుతుండటంతో, మేకర్స్ ఇంకా బలమైన ప్రమోషన్లను ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, రాబోయే రోజుల్లో సినిమా మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశముందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా చూస్తే, మెగాస్టార్ చిరంజీవి ఖాతాలో మరో బ్లాక్‌బస్టర్‌గా మన శంకర వరప్రసాద్ గారు నిలిచింది.


