ప్రభాస్ హీరోగా, ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో యాక్షన్ థ్రిల్లర్ ప్రాంఛైజీలో రాబోతున్న సీక్వెల్ ప్రాజెక్ట్ సలార్ 2. సీక్వెల్‌ను హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదూర్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. తాజా టాక్ ప్రకారం సలార్ 2టీజర్ జనవరి 25న విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారట మేకర్స్. ప్రస్తుతానికి ఇది అధికారిక వార్త ఏం కాకున్నా అభిమానులు మాత్రం ఈ అప్‌డేట్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. సలార్ 2లో శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తుండగా, శ్రియారెడ్డి, టిన్ను ఆనంద్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్‌లో సలార్ 2 షూటింగ్ మొదలైందంటూ వార్తలు వచ్చాయి. 20 రోజులపాటు సాగే సలార్ 2 చిత్రీకరణలో ప్రశాంత్ నీల్, ప్రభాస్, పృథ్విరాజ్, ప్రభాస్ పాల్గొంటున్నారని ఫిల్మ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ తెలిపారు.


