భారత బ్యాడ్మింటన్ స్టార్ పి.వి.సింధు నయా చరిత్ర సృష్టించింది. ఇండోనేసియా సూపర్ 500 మాస్టర్స్ టోర్నమెంట్లో సింధు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. ఈ క్రమంలో తన కెరీర్లో రికార్డు స్థాయిలో 500వ విజయాన్ని అందుకుంది. ఓ భారత షట్లర్ 500 విజయాల మైలురాయిని అందుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ ఘనత సాధించిన తొలి భారత షట్లర్‌గా సింధు చరిత్ర సృష్టించింది. ఓవరాల్‌గా 500వ విజయం సాధించిన ఆరో షట్లర్‌గా సింధు నిలిచింది. కాగా, గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రీక్వార్టర్ ఫైనల్లో సింధు 2119, 2118తో డెన్మార్క్‌కు చెందిన హోజ్‌మార్క్‌ను ఓడించింది. పురుషుల సింగిల్స్‌లో లక్షసేన్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. ప్రీక్వార్టర్ ఫైనల్లో సేన్ 2110, 2111తో హాంకాంగ్ ఆటగాడు జాసన్‌ను ఓడించాడు. ఆరంభం నుంచే చెలరేగి ఆడిన వరుసగా రెండు సెట్లు గెలిచి ముందంజ వేశాడు.


