మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, సెన్సేషనల్ డైరెక్టర్ తరుణ్ మూర్తి కాంబినేషన్లో మరో భారీ చిత్రం అధికారికంగా ప్రారంభమైంది. ఈ కొత్త ప్రాజెక్ట్‌పై కేరళతో పాటు సౌత్ ఇండియా అంతటా భారీ అంచనాలు నెలకొన్నాయి. L366 అనే వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ ప్రాజెక్ట్ నేడు అధికారికంగా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో మోహన్‌లాల్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. చాలా కాలం తర్వాత ఆయన పూర్తిస్థాయి ఖాకీ దుస్తుల్లో నటిస్తుండటం సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది. సీనియర్ నటి మీరా జాస్మిన్ ఇందులో కథానాయికగా నటిస్తుండగా, ఆషిక్ ఉస్మాన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రతీష్ రవి కథను అందించిన ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం, షాజీ కుమార్ ఛాయాగ్రహణం సమకూరుస్తున్నారు.


