My Telugu NRI

Mobile Scrollable Menu
- Cinema - Latest News

అనుపమ లాక్‌డౌన్.. రిలీజ్ డేట్ ఫిక్స్

అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన ఎమోషనల్ థ్రిల్లర్ లాక్‌డౌన్ ఎట్టకేలకు విడుద‌ల తేదీని ప్ర‌క‌టించింది. ఏఆర్ జీవా దర్శకత్వం.  ఈ చిత్రం గతేడాదే విడుదల కావాల్సి ఉన్నా, తమిళనాడులో సంభవించిన ప్రకృతి వైపరీత్యాలు మరియు కొన్ని సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమా కొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. ప్రతి నిరీక్షణ వెనుక ఒక బలమైన కారణం ఉంటుంది అనే […]

అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన ఎమోషనల్ థ్రిల్లర్ లాక్‌డౌన్ ఎట్టకేలకు విడుద‌ల తేదీని ప్ర‌క‌టించింది. ఏఆర్ జీవా దర్శకత్వం.  ఈ చిత్రం గతేడాదే విడుదల కావాల్సి ఉన్నా, తమిళనాడులో సంభవించిన ప్రకృతి వైపరీత్యాలు మరియు కొన్ని సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమా కొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. ప్రతి నిరీక్షణ వెనుక ఒక బలమైన కారణం ఉంటుంది అనే సందేశంతో ఈ నెల 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లు స్పష్టం చేసింది. ఈ చిత్రంలో అనుపమ అనిత అనే మధ్యతరగతి యువతిగా పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌ ఇవ్వనుంది. కరోనా లాక్‌డౌన్ కాలంలో సామాన్యులు ఎదుర్కొన్న చేదు అనుభవాలు, ముఖ్యంగా ఒక యువతి ఒంటరిగా క్లిష్ట పరిస్థితులను ఎలా ఎదుర్కొంది అనే యదార్థ గాథ ఆధారంగా ఈ సినిమాను మలిచారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచగా, నాయికా ప్రాధాన్యత ఉన్న ఈ చిత్రం అనుపమ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలుస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.