పాకిస్థాన్‌కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) షాక్ ఇచ్చింది. ఆ దేశ అధ్యక్షుడి భారత పర్యటన తర్వాత కీలక నిర్ణయం తీసుకున్నది. ఇస్లామాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహించే ప్రతిపాదనను యూఏఈ విరమించుకున్నది. 2025 ఆగస్ట్ నుంచి చర్చలు జరుగుతున్న ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నది. ఎయిర్‌పోర్ట్ కార్యకలాపాల అవుట్‌సోర్స్ భాగస్వామిని గుర్తించకపోవడంతో నిర్వహణ ప్రణాళికను యూఏఈ రద్దు చేసినట్లు పేర్కొంది. కాగా, మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో యూఏఈ అధ్యక్షుడు అల్ నహ్యాన్ జనవరి 19న భారత్‌లో ఆకస్మికంగా పర్యటించారు. ప్రధాని మోదీ ప్రత్యేక ఆహ్వానం మేరకు రెండు గంటల పర్యటనకు ఆయన విచ్చేశారు. యూఏఈ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారత్‌లో పర్యటించడం ఇది మూడోసారి. గత పదేళ్లలో ఐదో పర్యటన కావడం విశేషం. యూఏఈ అధ్యక్షుడి ఆకస్మిక భారత పర్యటన తర్వాత కీలకమైన పాకిస్థాన్ విమానాశ్రయ ఒప్పందాన్ని ఆ దేశం రద్దు చేయడం విశేషం.


