ఎన్టీఆర్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ చిత్రం దేవర బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా, ఓపెనింగ్స్ నుంచే రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోయింది. ఈ విజయంతోనే దేవరకు సీక్వెల్ ఉంటుందా? లేదా? అనే ప్రశ్నలు అప్పటినుంచి అభిమానుల్లో చర్చనీయాంశంగా మారాయి. నిర్మాతల నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడింది. దేవర నిర్మాతలలో ఒకరైన మిక్కిలినేని సుధాకర్, యువసుధా ఆర్ట్స్ అధినేతగా తాజాగా కీలక అప్డేట్ ఇచ్చారు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే దేవర 2 షూటింగ్ ఈ ఏడాది మే నెల నుంచి ప్రారంభం కానుంది. అలాగే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాం. ఈ ప్రకటనతో అభిమానుల్లో ఒక్కసారిగా ఉత్సాహం రెట్టింపయ్యింది. మొత్తానికి దేవర 2 మే నుంచి షూటింగ్, వచ్చే ఏడాదిలో రిలీజ్ అన్న నిర్మాత అప్డేట్తో, ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి ఇది నిజంగా ఊహించని గిఫ్ట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు అందరి చూపు దేవర పార్ట్ 2 ఎలాంటి రికార్డులు బ్రేక్ చేస్తుందో చూడాలి.


