భారత్ విషయంలో కెనడా రివర్స్ గేర్ వేసింది. ఇన్నాళ్లూ దౌత్య విభేదాలతో భారత్‌కు దూరంగా ఉన్న కెనడా గోవా వేదికగా జరుగుతున్న ఇండియా ఎనర్జీ వీక్ 2026 లో ఇరుదేశాల మధ్య ఇంధన బంధాన్ని కొత్త పుంతలు తొక్కిస్తోంది. ఈక్రమంలోనే కెనడా ఇంధన శాఖ మంత్రి టిమ్ హడ్గ్‌సన్, భారత పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి మధ్య చర్చలు సాగుతున్నాయి. ఈ సందర్భంగానే కెనడా మంత్రి షాకింగ్ కామెంట్లు చేశారు. ముఖ్యంగా ప్రపంచంలోని అత్యంత కీలకమైన ఇంధన మార్కెట్లలో ఒకటిగా భారత్ అభివృద్ధి చెందుతోందన్నారు. ఇంధన రంగంలో కెనడా సూపర్ పవర్ కావాలంటే భారత్‌థో వ్యాపారం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.


