My Telugu NRI

Mobile Scrollable Menu
- Andhra - Latest News

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ ..మార్చి 3న ఆలయం మూసివేత

మార్చి 3న సంభవించబోయే చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయ ద్వారాన్ని దాదాపు పదిన్నర గంటలపాటు మూసివేయనున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు. ఖగోళశాస్త్రం ప్రకారం ఈ చంద్రగ్రహణం మధ్యాహ్నం 3:20 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6:47 గంటలకు ముగుస్తుంది. ఆగమశాస్త్ర నియమాల ప్రకారం గ్రహణం పట్టడానికి ఆరు గంటల ముందే ఆలయ ద్వారాలను మూసివేయడం ఆనవాయితీ. ఈ క్రమంలోనే మార్చి 3న ఉదయం 9:00 గంటలకే శ్రీవారి ఆలయ తలుపులను మూసివేసి, గ్రహణ ప్రభావం పూర్తిగా తొలగిపోయిన […]

మార్చి 3న సంభవించబోయే చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయ ద్వారాన్ని దాదాపు పదిన్నర గంటలపాటు మూసివేయనున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు. ఖగోళశాస్త్రం ప్రకారం ఈ చంద్రగ్రహణం మధ్యాహ్నం 3:20 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6:47 గంటలకు ముగుస్తుంది. ఆగమశాస్త్ర నియమాల ప్రకారం గ్రహణం పట్టడానికి ఆరు గంటల ముందే ఆలయ ద్వారాలను మూసివేయడం ఆనవాయితీ. ఈ క్రమంలోనే మార్చి 3న ఉదయం 9:00 గంటలకే శ్రీవారి ఆలయ తలుపులను మూసివేసి, గ్రహణ ప్రభావం పూర్తిగా తొలగిపోయిన తర్వాత సాయంత్రం 7:30 గంటలకు తెరుస్తారు. ఆ తర్వాత ఆలయ అర్చకులు ఆలయ శుద్ధి, పుణ్యాహవాచనం వంటి సంప్రదాయ క్రతువులను నిర్వహిస్తారు. రాత్రి 8:30 నుంచి భక్తులను సర్వదర్శనం కోసం అనుమతిస్తారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.