My Telugu NRI

Mobile Scrollable Menu
- Cinema - Latest News

దుబాయ్‌లో అల్లు శిరీష్–నయనిక ప్రీ వెడ్డింగ్ వేడుకలు

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చిన్న కుమారుడు, హీరో అల్లు శిరీష్ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు. తన ప్రేయసి నయనికను ఈ ఏడాది మార్చిలో పెళ్లి చేసుకోనున్న శిరీష్, పెళ్లికి ముందే దుబాయ్‌లో గ్రాండ్‌గా ప్రీ వెడ్డింగ్ పార్టీ నిర్వహించాడు. కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రులతో కలిసి జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. మార్చిలో జరిగే వివాహానికి ముందు శిరీష్–నయనిక జంట దుబాయ్‌లో ఫ్యామిలీ అండ్ […]

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చిన్న కుమారుడు, హీరో అల్లు శిరీష్ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు. తన ప్రేయసి నయనికను ఈ ఏడాది మార్చిలో పెళ్లి చేసుకోనున్న శిరీష్, పెళ్లికి ముందే దుబాయ్‌లో గ్రాండ్‌గా ప్రీ వెడ్డింగ్ పార్టీ నిర్వహించాడు. కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రులతో కలిసి జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. మార్చిలో జరిగే వివాహానికి ముందు శిరీష్–నయనిక జంట దుబాయ్‌లో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కోసం ప్రత్యేకంగా ఈ పార్టీని ప్లాన్ చేశారు.

అల్లు అర్జున్ – స్నేహారెడ్డి దంపతులతో పాటు అల్లు కుటుంబం మొత్తం ఈ సంబరాల్లో పాల్గొంది. జే1 బీచ్ ప్రాంతంలో, సముద్రంలో ప్రయాణిస్తున్న బోటులో జరిగిన పార్టీ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పార్టీలో శిరీష్ షాంపైన్ బాటిల్ ఓపెన్ చేసి స్ప్రే చేయగా, చుట్టూ ఉన్న అతిథులంతా చప్పట్లతో హోరెత్తించారు. ఆ సమయంలో పక్కనే నిలబడ్డ అల్లు అర్జున్ నవ్వుతూ కనిపించాడు. శిరీష్, నయనిక ఇద్దరూ షాంపైన్‌ను షేర్ చేసుకుంటూ తమ ఆనందాన్ని పంచుకున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.