మాజీ మంత్రి అంబటి రాంబాబు ఏపీ హైకోర్టు ను ఆశ్రయించారు. తనపై నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అంబటి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం, ఈ పిటిషన్‌ను విచారించేందుకు అంగీకరించింది. రాజకీయ కక్షసాధింపులో భాగంగా తనపై ఏడేళ్ల లోపు శిక్షపడే సెక్షన్లతో కేసులు నమోదు చేశారని రాంబాబు తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసుల్లో ట్రయల్ కోర్టు తనకు రిమాండ్ విధించడాన్ని ఆయన హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తనపై ఉన్న కేసులను కొట్టివేసి, ఊరట కల్పించాలని కోరారు.


