My Telugu NRI

Mobile Scrollable Menu
- Latest News - NRI

ఉత్తర కొరియాలో కఠిన శిక్షలు

స్కిడ్‌ గేమ్‌ వంటి దక్షిణ కొరియా టీవీ షోలను వీక్షించినా, కే-పాప్‌ను ఆలకించినా ఉత్తర కొరియా ప్రభుత్వం తన ప్రజలకు మరణశిక్ష విధిస్తున్నదని మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ తాజాగా వెల్లడించింది. దక్షిణ కొరియాకు చెందిన మీడియాను వినియోగించినా స్కూలు పిల్లలను సైతం ఉత్తర కొరియా ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తున్నదని ఆమ్నెస్టీ తెలిపింది. విదేశీ కంటెంట్‌ వాడకంపై యువజనులను హెచ్చరించడానికి బహిరంగ మరణశిక్షలను బలవంతంగా వారికి చూపిస్తున్నదని ఉత్తర కొరియా నుంచి తప్పించుకుని పారిపోయిన పౌరుల […]

స్కిడ్‌ గేమ్‌ వంటి దక్షిణ కొరియా టీవీ షోలను వీక్షించినా, కే-పాప్‌ను ఆలకించినా ఉత్తర కొరియా ప్రభుత్వం తన ప్రజలకు మరణశిక్ష విధిస్తున్నదని మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ తాజాగా వెల్లడించింది. దక్షిణ కొరియాకు చెందిన మీడియాను వినియోగించినా స్కూలు పిల్లలను సైతం ఉత్తర కొరియా ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తున్నదని ఆమ్నెస్టీ తెలిపింది.

విదేశీ కంటెంట్‌ వాడకంపై యువజనులను హెచ్చరించడానికి బహిరంగ మరణశిక్షలను బలవంతంగా వారికి చూపిస్తున్నదని ఉత్తర కొరియా నుంచి తప్పించుకుని పారిపోయిన పౌరుల వాంగ్మూలాన్ని ఉటంకిస్తూ ఆమ్నెస్టీ వెల్లడించింది. ఆరోగ్యం, సామాజిక హోదాపై శిక్షలు ఆధారపడి ఉంటాయని, పేద ప్రజలు మరణంసహా కఠిన శిక్షలను ఎదుర్కోవలసి ఉంటుందని, పలుకుబడి ఉన్న లేదా సంపన్న కుటుంబాల వారు అధికారులకు లంచాలు ఇచ్చి మరణశిక్షలను తప్పించుకుంటారని హక్కుల సంస్థ వివరించింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.