విశాఖ నగరంలో మెట్రో నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయాన్ని ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబుకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ స్వయంగా తెలియజేశారు. ఆయనతో చంద్రబాబు నిర్వహించిన సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. వైజాగ్, విజయవాడలలో మెట్రో నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలను గతంలోనే కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పంపింది. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన కేంద్రం, తొలుత వైజాగ్‌లో మెట్రో నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసింది.


